మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్

Maharshi
Maharshi

మహర్షి…ఎప్పటినుండో మహేష్ అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా ఎదురుచూసిన సినిమా.అందుకే ఒక రేంజ్ లో ప్రీ రీలీజ్ బిజినెస్ జరిగింది.ఇక ఆన్ లైన్ బుకింగ్స్ లో కూడ మహర్షి జోరు చూసి అవాక్కయ్యారు.అన్ని ఫ్యాక్టర్స్ అన్నీ వర్క్ అవుట్ కావడంతో మహర్షి మొదటిరోజు కోట్ల వర్షం కురిపించింది.చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ దక్కించుకున్న ఈ సినిమా మరికొన్ని చోట్ల మాత్రం బాహుబలి:ది బిగినింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.బాహుబలి ఫస్ట్ పార్ట్ నైజాం లో మొదటిరోజు 6.22 కోట్లు కొల్లగొట్టింది.అయితే మహర్షి మాత్రం మొదటిరోజు 6 కోట్ల 38 లక్షలు కలెక్ట్ చేసి భారీ మార్జిన్ తో బాహుబలి ని క్రాస్ చేసింది.RTC క్రాస్ రోడ్స్ లాంటి చోట రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రావడం,మార్నింగ్ షో తరువాత కూడా పాజిటివ్ రికార్డ్స్ దక్కించుకోవడంతో మహర్షికి ఈ రేంజ్ కలెక్షన్స్ దక్కాయి.

నైజాం తో పాటు గుంటూరు లో కూడా మహర్షి దూకుడు అలానే ఉంది.అక్కడ కూడా ఫస్ట్ డే బాహుబలి ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ ని అవలీలగా దాటేసింది.చెన్నై సిటీ వరకు చూసుకున్నా కూడా మహర్షి 23 లక్షలకు పైగా షేర్ రాబట్టి అక్కడ సూపర్ స్టామినా ఎంత అనేది తెలిసేలా చేసింది.అయితే ఓవర్ సీస్ లో సీన్ మాత్రం రివర్స్ అయ్యింది.అక్కడ మహేష్ సినిమా మినిమమ్ కంటెంట్ ఉన్నా కూడా వసూళ్లు దంచేసి మొదటి రోజే మిలియన్ మార్క్ టచ్ చేస్తుంది.కానీ ఈ సారి భారీ నంబర్స్ లో ప్రీమియర్స్ వేసినా,ఫస్ట్ డే మొత్తం కలుపుకుని కేవలం హాఫ్ మిలియన్ డాలర్స్ కి కాస్త ఎక్కువగా మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.మహేష్ క్రేజ్ అక్కడ ఎందుకు వర్క్ అవుట్ కాలేదు అనేది యూనిట్ కే అర్ధం కావట్లేదు.మొత్తం అన్ని ఏరియాలు కలుపుకుంటే మహర్షి ఫస్ట్ డే షేర్ 20 కోట్లకు పైగానే ఉంది.

కానీ ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే మాత్రం పదోరోజుల పాటు ఈ రేంజ్ కలెక్షన్స్ రావాలి.లేదంటే మాత్రం మళ్ళీ మహేష్ బాబు సినిమా బయ్యర్స్ కి నష్టాలు మిగిల్చింది అన్న మాట వినిపిస్తుంది.ఈ మధ్య టాక్ కి సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కి సంబంధం ఉండట్లేదు.అలాగే మొదట రోజు కలెక్షన్స్ చూసి సినిమా సక్సెస్ రేంజ్ అంచనా వెయ్యడం కష్టం అని అరవింద సమేత ప్రూవ్ చేసింది.అలాగే టికెట్స్ రేటు వీలైనంత త్వరగా తగ్గిస్తే ఓకే లేదంటే మాత్రం పైరసి పోటు తప్పకపోవచ్చు.సమ్మర్ సీజన్,మహేష్ క్రేజ్ ఈ రెండు మాత్రమే ఈ సినిమాకి సేవియర్స్.మరి బాగానే మొదలయిన మహర్షి ప్రయాణం ఎలా ముగుస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.