ఏపి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్‌గా ఎంఏ షరీఫ్

MA Sharif
MA Sharif

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒక నామినేషన్ దాఖలవడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ చార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు . అనంతరం ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ప‌లువురు నేతలు షరీఫ్‌ను చైర్మన్ స్థానం వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ తరువాత శాసనమండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలి చైర్మన్‌గా షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికవడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. షరీఫ్‌తో తనకు మంచి అనుబంధం ఉందన్నారు ఆయ‌న‌. తను నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న వ్యక్తిత్వం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడ్డారని గుర్తు చేశారు సిఎం.