వంద కోట్ల క్లబ్ లో మోహన్ లాల్ ‘లూసిఫర్’…!

Mohanlal
Mohanlal

హీరో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన చిత్రం ‘లూసిఫర్’. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ.100 కోట్లను వసూలు చేసి..అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మీరిచ్చిన అపరిమితమైన మద్దతుకు ఫలితం. మలయాళ చిత్రపరిశ్రమ ఖండాంతరాల్లోకి వెళ్లిపోయింది. పృథ్విరాజ్ అండ్ టీంకు అభినందనలు అని మోహన్ లాల్ ట్వీట్ చేశాడు. రూ. 100కోట్ల క్లబ్ లోకి చేరిన మూడో మళయాళ చిత్రంగా లూసిఫర్ నిలిచింది. మోహన్ లాల్ నటించిన పులిమురుగన్ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి చిత్రం కాగా..నివిన్ పాలీ నటించిన కాయంకులం కోచున్ని రెండో చిత్రంగా నిలిచింది.