ఈ నెల 18న రెండో దశ సార్వత్రిక ఎన్నికలు

lok sabha elections Phase 4
lok sabha elections Phase 4

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. పుదుచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరగనుంది. కర్ణాటకలో 14 చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపిలో 8, అసోం, బీహార్‌, ఒడిశాలలో 5 చోట్ల, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌లో మూడు చోట్ల, జమ్మూకాశ్మీర్‌లో రెండు చోట్ల, మణిపూర్‌, త్రిపురలో ఒక్కోచోట చొప్పున రెండోదశలో పోలింగ్‌ ను నిర్వహిస్తారు. యూపిలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుంటే.. 8 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరగనుంది. అయితే ఈ 8 స్థానాలు బిజెపి సిట్టింగ్‌ స్థానాలే కావడం గమనార్హం.