లోక్‌స‌భకు తొలి విడత‌కు ముగిసిన పోలింగ్

lok sabha elections Phase 4
lok sabha elections Phase 4

లోక్‌స‌భ తొలి విడత‌కు జ‌రిగిన పోలింగ్ ముగిసింది. దేశ‌వ్యాప్తంగా తొలి ద‌శ‌లో భాగంగా 20 రాష్ట్రాల్లో మొత్తం 91 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రిగింది. సాయంత్రం అయిదు గంట‌ల‌కు పోలింగ్ ముగిసింది. అయితే తెలంగాణ‌లోని నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉన్న ఓట‌ర్ల‌కు గ‌డ‌వు స‌మ‌యం ముగిసినా.. వారికి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. నాగాలాండ్‌లో అత్య‌ధికంగా మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 68 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. తెలంగాణ‌లో మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 48.95 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది.