గోవా అసెంబ్లీ బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గిన సిఎం

led Government wins the trust vote in Goa Assembly.
led Government wins the trust vote in Goa Assembly.

గోవా అసెంబ్లీ బ‌ల ప‌రీక్ష‌లో సీఎం ప్ర‌మోద్ సావంత్ గెలుపొందారు. ప‌నాజీలోని అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష జ‌రిగింది. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం ప్ర‌మోద్‌కు అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. మ‌నోహ‌ర్ పారిక‌ర్ మృతితో గోవాలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌ధ్యంలో సీఎంగా ప్ర‌మోద్ ప్ర‌మాణం చేశారు. అనంత‌రం ఆయ‌న అసెంబ్లీలో త‌న మెజారిటీ నిరూపించుకోవాల్సి వ‌చ్చింది.

రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నలభై మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీ తనకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిపింది. ఆ పార్టీకి సొంతంగా 12 మంది సభ్యులుండగా, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీకి చెందిన ముగ్గురేసి సభ్యులు, ముగ్గురు ఇండిపెండెంట్లు తమకు మద్దతునిస్తున్నారని వెల్ల‌డించింది. విశ్వ‌స‌ప‌రీక్ష‌లో సీఎం సావంత్‌కు 20 మంది ఎమ్మెల్యేలు స‌పోర్ట్ ఇవ్వ‌డంతో ఆయ‌న బ‌ల ప‌రీక్ష‌లో విజ‌యం సాధించారు.