చిత్రలహరి టార్గెట్ ఛేదిస్తుందా….?

Chitralahari
Chitralahari

వరుసగా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా చిత్రలహరి.ఇంతకుముందు తేజు సినిమా అంటే భయంకరమయిన యాక్షన్ ఉండేది.అలాగే మాస్ ని అలరించే ఒకరి రెండు ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూడా కామన్.అవన్నీ కూడా అవుట్ డేట్ అయిపోయాయి అని ఆలస్యంగా గ్రహించిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కొత్తదారిలో వెళుతున్నాడు.

పూర్తిగా లవ్ అండ్ ఎమోషన్స్ మాత్రమే ఎస్సెట్స్ గా రూపొందిన చిత్రలహరి లో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా సటిల్ ఎమోషన్స్ పండించే పాత్రలో కనిపించబోతున్నాడు.పైగా ఈ సినిమాలో హీరోయిన్స్ కే ఎక్కువ స్కోప్ ఉంది అని కూడా అంటున్నారు.నాని ఈ స్క్రిప్ట్ ని వదులుకుంది కూడా అందుకే.ఆరు ప్లాపుల తరువాత కూడా తేజు సినిమాకి 15 కోట్ల రేంజ్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.

అయితే ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ పై తెరకెక్కడం ఈ సినిమాకి ఫస్ట్ క్రెడిబిలిటీ.ఇక ఈ కథ నాని ని కూడా కొంతవరకు మెప్పించడం,ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఎమోషనల్ కంటెంట్ ని సూపర్ గా హ్యాండిల్ చెయ్యగలగడం వంటివి ఈ సినిమాకి మేజర్ ఎస్సెట్స్ గా నిలిచాయి.ఇక చిరు ఈ సినిమాకి కరెక్షన్స్ చెప్పడం అనే వార్త కూడా సినిమా బిజినెస్ ని కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసింది.

ఈ సినిమాకి ముందు నుండి కాస్ట్ కటింగ్ పద్ధతి పాటించడం వల్ల నిర్మాతలకి ఒక మోస్తరు లాభాలు అందడం ఖాయం.కానీ ప్రీ రిలీజ్ రేంజ్ లో రికవరీ ఉంటుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.