లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ : క్లీన్ ‘U’ సర్టిఫికెట్

Lakshmis NTR
Lakshmis NTR

RGV తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో తెలియదుగాని ఆ సినిమా రిలీజ్ మాత్రం ఒక థ్రిల్లర్ మూవీ లా ఉంది.రిలీజ్ అవుతుంది అని ఒక రోజు,క్లియరెన్స్ రాలేదు ని ఒక రోజు ఇలా ఒక్కోసారి ఒక్కో వార్త హల్చల్ చేస్తుంది.దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ శుక్రవారమయినా రిలీజ్ అవుతుందా లేదా అనేది పెద్ద పజిల్ గా మారింది.ఎట్టకేలకు EC ఈ సినిమా చూసి క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ వివాదాస్పద సినిమా విడుదల ఓకే అయ్యింది.అయితే ఈ సినిమా రిలీజ్ కి EC ఓకే అనడంతో వర్మ చెప్పిన మాటల్లో ఉన్నంత మ్యాటర్ సినిమాలో లేదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుండి కూడా క్లియరెన్స్ వచ్చింది.ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.అయితే ఈ రేటింగ్ సినిమాపై నెగెటివ్ ప్రభావం చూపిస్తుంది.ట్రైలర్ లో ఉన్న మసాలాలు సినిమాలో లేవని,సినిమా అంతా ఊహించినట్టుగా కాకుండా చప్పగా సాగుతుంది అనే అభిప్రాయానికి వచ్చేసారు ప్రేక్షకులు.దీంతో ఒక రాజకీయ వర్గం ఆనందంగా ఉంది.ఎదో జరిగిపోతుంది అని ఊహించుకుని చివరికి ఏమీ జరగట్లేదు అని అర్ధం చేస్తున్న మరొక పక్షం కాస్త దిగాలుగా ఉన్నట్టు టాక్.మొత్తానికి మరొకసారి ట్రైలర్ తో ప్రకంపనలు సృష్టించి సినిమాతో మాత్రం డిసప్పాయింట్ చెయ్యబోతున్నాడు RGV అని ముందే కన్వే అయిపోయింది.