జూన్‌లో విడుదల కానున్న లక్ష్మీస్‌ వీరగ్రంథం…!

Lakshmis-Veeragrandham
Lakshmis-Veeragrandham

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్‌ వీరగ్రంథం.కాగా ఈ సినిమా సెన్సార్‌ ఇటివలే పూర్తి చేసుకుంది. ఎన్నికల సమయంలో కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో చిత్రాన్ని విడుదల చేయాలన్న సంకల్పంతో రిలీజ్‌ ఆలస్యమైందని చిత్ర దర్శకుడు, నిర్మాత తెలిపారు. చిత్రం విడుదల ఆలస్యం కావడానికి రాజకీయ కారణాలు ఏమీ లేవని, ఏ ఇతర శక్తులకు భయపడి చిత్రం విడుదల ఆలస్యం చేయలేదని అన్నారు. ఈ చిత్రం జూన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి విడుదల చేస్తామని తెలిపారు.ఎన్టీఆర్‌ చరిత్ర ఆధారంగా నటుడు బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు, లక్ష్మీపార్వతి కోణంలో రాంగోపాలవర్మ తీసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాలు లక్ష్మీపార్వతి జీవితంలోని వీరగ్రంథం పాత్రను విస్మరించడం జరిగిందన్నారు.వారు వదిలివేసిన భాగాన్ని కూడా తెరకెక్కిస్తే ఎన్టీఆర్‌ మొత్తం జీవితంలో జరిగిన సంఘ టనలు పూర్తిగా ప్రజలకు తెలుస్తాయన్నారు. లక్ష్మీపార్వతి, వీరగ్రంథం కథాంశంగా లక్ష్మీస్‌ వీరగ్రంథం చిత్రాన్ని నిర్మించినట్లు వెల్లడించారు.