లక్మిస్ ఎన్టీఆర్ ట్రైలర్ : వర్మ మార్క్

Lakshmi's NTR Movie Trailer Review in Telugu
Lakshmi's NTR Movie Trailer Review in Telugu

ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడమే తన ధ్యేయం అంటూ లక్ష్మిస్ ఎన్టీఆర్ కి శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ మాటలని మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఎన్నో సినిమాలు ఓపెనింగ్ వరకే పరిమితం చేసాడు వర్మ.కానీ ఈ సారి మాత్రం లేట్ గా సినిమా మొదలుపెట్టినా కూడా చాలా త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ కి కూడా రెడీ చేసాడు.ఎన్టీఆర్ స్వర్గం నుండి తనను తిట్టి ట్రైలర్ ని రిలీజ్ చెయ్యమన్నాడు అని తన శైలిలో ఒక పోస్ట్ పెట్టి ట్రైలర్ ని రిలీజ్ చేసాడు.

ఆ ట్రైలర్ చూస్తే ఒక సినిమాలా కాకుండా ఒక వ్యక్తి మీద ఉన్న పగ మొత్తం సినిమా రూపంలో తీర్చుకున్నట్టు ఉంది.ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఏ జరిగింది అనే దాని వరం తన కోణంలో చూపిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే విషయం మరో సారి ప్రూవ్ అయ్యింది.చంద్రబాబు కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పండగ చేసుకొనేలా వర్మ వెర్షన్ ఉంది అని అర్ధమవుతుంది.అయితే ఈ సినిమాకి వర్మతో పాటు అగస్త్య మంజు కూడా దర్శకత్వం వహించడం అనేది గమనించాల్సిన విషయం.అంటే పేరు వర్మ ది పని అగస్త్య ది అనుకోవచ్చు.

ఈ సినిమాలో వర్మ ఎంచుకున్న కాస్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.విజయ్ కుమార్ ఎన్టీఆర్ లా కనిపించడానికి,నటించడానికి చాలా కసరత్తు చేసాడు.ఇక యజ్ఞ శెట్టి ఏ కోణంలోనూ లక్ష్మి పార్వతి లా కనిపించకపోయినా కూడా మిగతా పాత్రలవల ఆమెని రిలేట్ చేసుకోకునేలా ప్లాన్ చేసారు.ఇక ఎన్టీఆర్ సినిమాలో రాజశేఖర రెడ్డి గా కనిపించిన శ్రీ తేజ్ తో బాబు పాత్ర వేయించాడు.అయితే ప్రతి పాత్ర వాయిస్ కూడా ఇమిటేషన్ స్టైల్ లో చెప్పించారు. దాని వల్ల సినిమాటిక్ ఫీల్ తగ్గినా అనుకున్న అప్పీల్ మాత్రం వస్తుంది.

ఓవర్ ఆల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో తాను తియ్యాలనుకున్నది తీసాడు,తాను చెప్పాలనుకున్నది చెప్పాడు వర్మ.నచ్చిన వెళ్లి జై కొడతారు,నచ్చని వాళ్ళు ఛీ కొడతారు.కానీ rgv రెండింటిని పట్టించుకోడు కాబట్టి పెద్దగా ప్రాబ్లెమ్ ఉండకపోవచ్చు.

Lakshmi’s NTR Movie Trailer