లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పైరసీ పోటు

Lakshmis NTR
Lakshmis NTR

ఈసారి నేనేంటో చూపిస్తా అంటూ గతకొంతకాలంగా చెబుతూ తీరా అవుట్ ఫుట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రేక్షకులపై కక్ష కట్టినట్టు ఉండేలా సినిమాలు తెరకెక్కిస్తున్న వర్మ ఈ సారి కాంట్రవర్సి కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసాడు.చంద్రబాబు ని డైరెక్ట్ గా అటాక్ చెయ్యడంతో ఎలెక్షన్స్ జరుగుతున్న కారణంతో AP లో సినిమా రిలీజ్ చెయ్యకుండా ఝలక్ ఇచ్చారు.

సినిమా ఎలా ఉంది అనేది పక్కనబెడితే దారుణమైన సినిమాలు తీస్తున్న RGV ఈ మధ్య కాలంలో ఇచ్చిన బెస్ట్ అవుట్ ఫుట్ అని ఎక్కువమంది చెబుతున్నారు.కానీ AP లో రిలీజ్ లేదు.పోనీ సినిమాకి టాక్ బావుందికదా తరువాత అయినా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు RGV .ఈ లోగా ఈ టోటల్ ఎపిసోడ్ ని గమనించిన తమిళ్ రాకర్స్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారు.

దీనికి ఉన్న డిమాండ్ గమనించి సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే HD ప్రింట్ ని ఆన్ లైన్ లో పెట్టేసారు.క్లియర్ సౌండ్ అండ్ క్లియర్ కట్ విజువల్ ఉండడంతో AP లో ఎక్కువమంది హ్యాపీ గా ఆ సినిమాని ఫోన్స్ లో,కంప్యూటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.అలాగే ఈ సినిమా డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకుంటున్నారు.

దీంతో తియ్యక తియ్యక సినిమాలా ఉండే సినిమా తీసిన RGV కి హై వోల్టేజ్ షాక్ తగిలినట్లయింది.ఇప్పటివరకు బయటికి ఏదేదో మాట్లాడిన RGV కి పైరసీ పోటు బలంగా తగిలింది.నిజానికి ఈ సినిమా AP లో రిలీజ్ అయ్యి ఉంటే అతని ఉద్దేశం నెరవేరేది.కానీ దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోవడం,ఇలా తమిళ్ రాకర్స్ రెచ్చిపోవడంతో తేలుకుట్టిన దొంగలా ఉంది రాము పరిస్థితి.