‘కెజిఎఫ్’ సినిమాకు కేటీఆర్ ప్రశంసలు…!

KTR
KTR

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ సినిమాలు చూస్తుంటారు. చూసిన ప్రతి సినిమా గురించి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన కన్నడ హిట్ సినిమా ‘కెజిఎఫ్’ వీక్షించారు. ఈ  సినిమా గురించి మాట్లాడుతూ ‘సినిమా చూడటం కొంచెం లేటైంది. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే, బిజిఎమ్ బాగున్నాయి. రాక్ స్టార్ యాష్ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చింది’ అన్నారు.కాగా ఈ సినిమాలో కన్నడ హీరో యాష్ హీరోగా నటించాడు.ఈ సినిమా రెండోవ భాగం చాప్టర్ 2 త్వరలో విడుదల కానుంది.