మల్లేశం ట్రైలర్ అద్భుతంగా ఉంది: కేటీఆర్‌

KTR
KTR

రాజ్.ఆర్ దర్శకత్వంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన వ్యక్తి చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం’.అయితే ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ పొందింది.అయితే ఈ ట్రైలర్ ఫై తెలంగాణా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రశంసలు కురిపించారు.తాను మల్లేశం ట్రైలర్‌ చూశానని తెలిపారు కేటీఆర్‌. ‘ఆసుయంత్రాన్ని ఆవిష్కరించిన గ్రామీణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం స్ఫూర్తిదాయకం. అద్భుత ఆవిష్కరణతో చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. మల్లేశం సినిమా బృందానికి శుభాకాంక్షలు’అని కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.