పంచాయితీల ఏక‌గ్రీవానికి కేటీఆర్ న‌జ‌రానాలు…!

TRS Working President KTR

పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందించే రూ.10 లక్షలు అందిస్తోంది. అయితే స్థానిక సంస్థ‌ల‌లో గెలుపూ ల‌క్ష్యంగా సిరిసిల్లాలోని పంచాయితీల‌కు టి ఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ మ‌రో ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. మొత్తం 117 గ్రామాలలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు.

ఏకగ్రీఏవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం తరపున ఇచ్చే పది లక్షలతో పాటు అదనంగా ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.15 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ రూ.25 లక్షలతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చని చెప్పారు. దీంతో రాజీపడిన నాయకులకు నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని అభ‌యం ఇచ్చారు కేటీఆర్‌.