ఏపీ రాజకీయాలకి వస్తున్న కేటీఆర్ ?

KCR, KTR, Telangana, Andhara, Chnadarababu,
KTR

ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న టిఆర్ఎస్ ..ఇది నిజామా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరాస ప్రత్యక్షంగా వేలు పెట్టడానికి సిద్ధమయిందనే సంకేతాలు నిన్న రాజభవన్ లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బయటికి వచ్హాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే.. పలువురు ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానం అంది నది. కొంత మంది.. టీఆర్ఎస్ రంగు .. గులాబీ రంగు కోటుతో ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు.కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. వారిలో విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త సన్యాసిరావు కూడా ఉన్నారు. సన్యాసిరావు గులాబీ కోటుతో రాజ్‌భవన్‌కు వచ్చినప్పటి నుంచి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించారు.

 

ఏపీలో టీఆర్‌ఎస్‌ టికెట్‌తో పోటీ చేయమని ఆఫర్ కూడా ఇచ్చేశారు  . ఇంకా ఎవరితో ఇలా మాట్లాడారో కానీ, సన్యాసిరావుతో మాట్లాడింది మాత్రం మన మీడియా చెవుల్లో పడింది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న కేటీఆర్ మాత్రం.. తెలంగాణలో టీడీపీ పోటీ చేయగా లేనిది.. తాము ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదు మరి. ఈ క్రమంలో కేటీఆర్ AP లోనూ పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో.. జగన్‌ తో చర్చలు కూడా జరుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ పోటీ వల్ల.. తెలుగుదేశం పార్టీకి వొక్క ఓటు తగ్గే అవకాశం ఉన్నా… పోటీ చేయడం ఖాయమనే అంచనా .