త‌ల‌సానికి తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్ మ‌ద్ద‌తు

KCR, KTR, Telangana, Andhara, Chnadarababu,
KTR

సికింద‌రాబాద్ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌కు తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశం మద్దతు తెలిపింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంత‌రం కేటీఆర్‌ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ వరుసగా ఐదోసారి ఎంపికైంద‌న్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇవ్వడం లేద‌న్నారు. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీలు గెలిస్తే, ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుంద‌న్నారు ఆయ‌న‌. ఢిల్లీలో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే, కేంద్రం మెడలు వంచి మన హక్కులు సాధించుకోవచ్చ‌న్నారు. ప్రాంతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు కేటీఆర్ .