బాలయ్య డైరెక్టర్ పై మహేష్ కర్చీఫ్…?

Radha Krishna Jagarlamudi
Radha Krishna Jagarlamudi

అనిల్ రావిపూడి…నాలుగు సినిమాలతో వరుసగా నాలుగు హిట్స్ అందుకున్నాడు.దాంతో అతనికి టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.F2 లో వెటరన్ హీరో వెంకటేష్ ని కూడా ఫుల్ గా వాడుకుని కెరీర్ బెస్ట్ హిట్ అందించడంతో సీనియర్ హీరోస్ కూడా అనిల్ రావిపూడి అనే ఆప్షన్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు.ఇప్పటికే బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ కి సినిమా చెయ్యడానికి రెడీ గా ఉన్నాడు.అనిల్ కూడా ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలు చేసాడు.

దాంతో ఈసారి బయట బ్యానర్ లో చెయ్యాలని చూస్తున్నాడు.అంతే కాదు తన రెమ్యునరేషన్ కూడా 50 శాతం పెంచాడు.అంటే మూడున్నర నుండి అయిదు కోట్లకు పెంచాడు.అయితే కొత్త డైరెక్టర్స్ వైపు చూస్తున్న మహేష్ కూడా F2 చూసి అనిల్ ని ఒక రేంజ్ లో పొగిడాడు.

అంతే కాదు ఒక సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు.అయితే సుకుమార్ సినిమా,ఒకవేళ సుకుమార్ తో కాకపోతే క్రిష్ సినిమా,ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా తో సినిమా…ఆ రెండిటి తరువాత అనిల్ తో సినిమా చేయాలన్నది మహేష్ ప్లాన్.అయితే బాలయ్య సినిమా,అలాగే అంతా అంటున్న F3 తరువాత అనిల్ మహేష్ సినిమాకి వెళ్లాల్సి రావచ్చు.అయితే వాటిలో ఏదైనా తేడా కొడితే మాత్రం ఆ సినిమా డౌటే.మొత్తానికి చిన్నగా కెరీర్ మొదలుపెట్టిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక్క మెట్టు ఎక్కుతూ పెద్ద స్థాయికి వెళుతున్నాడు.