దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరు

Kodi Ramakrishna is an Indian film director and writer known for his works predominantly in Telugu cinema, and a few Tamil, Malayalam and Hindi films
Kodi Ramakrishna is an Indian film director and writer known for his works predominantly in Telugu cinema, and a few Tamil, Malayalam and Hindi films

ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన సీనియర్ దర్శకుడు కోడి రామ‌కృష్ణ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు తెరకెక్కించారు. 90ల‌లో ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన కోడి రామ‌కృష్ణ తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే మరోవైపు ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ వంటి ఫాంటసీ చిత్రాలను రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందించారు. 1982లో దర్శకుడిగా తన ప్రయాణాన్ని కోడి రామకృష్ణ ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తెరకెక్కించారు. అప్పటి నుంచి మొదలుకొని 2016 వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు. చివ‌రిగా క‌న్నడ భాష‌లో ‘నాగరహవు’ (తెలుగులో నాగభరణం) అనే చిత్రాన్ని తీసారు.