ఈసీపై స్పీకర్ కోడెల ఫైర్

ఈసీపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో విఫలమైనందుకు ఈసీ సిగ్గుపడాలన్నారు. కేంద్ర బలగాలు ఇవ్వకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఒక చోట పోలింగ్‌ బూత్‌లో హోంగార్డు మాత్రమే ఉన్నాడన్నారు. ఇనిమెట్లలో వైసీపీ నేతలు రెచ్చగొట్టి దౌర్జన్యం చేశారని, ఇంతవరకు తన ఎదురుగా వచ్చి చెయ్యెత్తిన పరిస్ధితి లేదన్నారు ఆయన. ఎన్ని చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని కోడెల ధీమా వ్యక్తం చేశారు.