దోషులెవ‌రో నిగ్గుతేల్చ‌డంటోన్న కోదండరామ్‌

Kodandaram
Kodandaram

ఇంటర్మీడియట్‌ బోర్డు ఎదుట ఈ నెల 29న ధర్నా చేస్తామని టిజెఎస్‌ నేత కోదండరామ్‌ చెప్పారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని ఆయన అన్నారు. విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంటర్‌ ఫలితాలు, దోషులెవరు ? పరిష్కారం ఏమిటి అనే అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కోదండరామ్‌, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, ఇతర సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న ఆసక్తి … విద్యార్థులపై లేదని ప్రభుత్వాన్నివిమ‌ర్శించారు.