ఎంగేజింగ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `కిల్ల‌ర్‌`

Killer is Suspense thriller
Killer is Suspense thriller

విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్‌’.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆండ్రూ లూయిస్‌ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరైంది..

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సైమన్ కె కింగ్ మాట్లాడుతూ `ఇది నా మొదటి తెలుగు సినిమా.. పాటలకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.. సినిమా చాలా బాగుంటుంది.. స్టోరీ , విజువల్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి..విజయ్ , అర్జున్‌గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు..

చిత్ర రచయిత భాష శ్రీ మాట్లాడుతూ కిల్లర్` సినిమా జూన్ 7 న వస్తుంది.. `నకిలీ` నుంచి ఇప్పటివరకు విజయ్ ఆంటోనీ గారు చేసిన అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు.. ఇది కూడా చాలా బాగుంటుంది.. ఇది వంద సినిమాల్లో ఒక సినిమాల ఉండదు.. వంద సినిమాలకు ఒక సినిమా లా ఉంటుంది.. అర్జున్ గారి యాక్టింగ్ సూపర్.. సరికొత్త స్టైల్ లో దర్శకుడు సినిమా చేశారు.. ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు.

హీరోయిన్ ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ ఈ సినిమా తో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ఎంతో నేర్చుకున్నాను.. నన్ను హీరోయిన్‌గా తీసుకున్నందుకు నిర్మాతలకు , హీరోగారికి చాల థాంక్స్. ఎప్పటికైనా హీరోయిన్ సావిత్రి గారంత పెద్ద హీరోయిన్ అవ్వాలి అని నా కోరిక.. ఈ సినిమా కోసం అందరు చాల కష్టపడ్డారు.. సినిమా అవుట్ చాల బాగా వచ్చింది. విజయ్ ఆంటోనీ గారితో, అర్జున్ గారితో నటించడం మర్చిపోలేనిది అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ జూన్ 7 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.. విజయ్ ఆంటోనీ, అర్జున్ ఇద్దరు తమ నటనతో ఆకట్టుకున్నారు.. సినిమా చాలా బాగుంటుంది.. సినిమా కథ పట్ల ఆసక్తితోనే ఈ సినిమా ను తెలుగులో రిలీజ్ చేయాలనీ అనుకున్నాం.. ఇంట్రెస్టింగ్ అంశాలు, ఉత్కంఠభరిచే సన్నివేశాలు చాలనే ఉన్నాయి.. సినిమా ని అందరు తప్పకుండా ఆదరించండి అన్నారు..

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ కళకు భాష తో సంబంధం లేదు అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.. సినిమా ప్రమోషన్స్ చాల బాగా చేస్తున్నారు.. సినిమా కూడా బాగుంది.. పెద్ద హివ‌ట్ అవుతుంది. .. మళ్ళీ సక్సెస్ మీట్ లో తప్పకుండా కలుద్దాం అన్నారు..