కియారా ఆడ్వాణీ అసలు పేరు ఏంటో తెలుసా…!

kiara advani
kiara advani

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కియారా ఆడ్వాణీ. ఆ తర్వాత రామ్‌చరణ్ నటించిన వినయవిధేయ రామ సినిమాలోనూ మెరిసింది. 2104లో పుగ్లి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా అసలు పేరు ఆలియా ఆడ్వాణీ అట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సూచన మేరకు తన పేరును కియారాగా మార్చుకుందట. `నాకు మా అమ్మానాన్నా పెట్టిన పేరు ఆలియా. కానీ, నేను బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సమయానికే అదే పేరుతో వేరే హీరోయిన్ ఉన్నారు. అప్పుడు సల్మాన్ నన్ను పేరు మార్చుకోమని సూచించారు. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండకూడదని ఆయన చెప్పారు. అప్పుడు నేను కియారా అనే పేరును సెలెక్ట్ చేసుకున్నాను’ అని తెలిపింది కియారా.