భయపెడుతున్న కామోషి ట్రైలర్

Khamoshi
Khamoshi

తమన్నా,ప్రభుదేవా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా కామోషి.హారర్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాని చక్రి తోలేటి డైరెక్ట్ చేసాడు.అయితే ఈ సినిమాలో ప్రభుదేవా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించడం విశేషం.ఈ సినిమా ట్రైలర్ చూస్తే లండన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.అలాగే లైటింగ్ ప్యాట్రన్ అండ్ ఆర్.ఆర్ ల సాయంతో హారర్ ఫీల్ కూడా బాగా ఎలివేట్ చేసారు.ట్రైలర్ వరకు చూస్తే మరీ సూపర్ కాకపోయినా ఓకే అనిపిస్తుంది.అయితే ఈ సినిమా ప్రభుదేవా,తమన్నా లే ప్రధానపాత్ర దారులుగా నటించిన హారర్ మూవీ అభినేత్రి-2 కి పోటీగా మే 31 న రిలీజ్ అవ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది.