కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభం…!

Keerthi Suresh

మహానటి సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి గా నటించి ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న నటి కీర్తి సురేష్.తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మరో చిత్రం ప్రారంభం అయింది.ఈ సినిమాకు పాత్రికేయుడు మహేష్‌ కోనేరు నిర్మాత. ఈ చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. నరేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, హీరో కళ్యాణ్‌ రామ్‌, దర్శకులు వెంకీ అట్లూరి, హరీష్‌ శంకర్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కీర్తి సురేష్‌ మాట్లాడుతూ. తెలుగులో మహానటి తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. నాయిక ప్రధానంగా సాగుతుంది. ప్రతి అమ్మాయికీ నచ్చే సినిమా అవుతుంది. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుగు తుంది. దర్శకుడు నరేంద్ర మంచి కథను సిద్ధం చేశారు. నాకు మరింత పేరు తీసుకొచ్చే సినిమా అవుతుందని నమ్మకముంది. అన్నారు.

దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ.మూడేళ్లుగా ఈ కథపై కసరత్తులు చేస్తున్నాను. అన్ని భావోద్వేగాలు కలిసి కథ ఇది.కీర్తి సురేష్‌ తప్ప ఈ కథకు మరే నాయికా సరిపోరు. ఒక భాగం మన దేశంలో, మూడొంతులు అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్‌ నుంచి అమెరికా షెడ్యూల్‌ ఉంటుంది. ఫిబ్రవరిలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతాం అన్నారు.

నిర్మాత మహేష్‌ కోనేరు మాట్లాడుతూ.మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో కీర్తి సురేష్‌ గొప్ప స్థానం సంపాదిం చుకున్నారు. ఇది మహిళా ప్రధాన చిత్రం. ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట ఈ చిత్రంలోని సందర్భాలను తన జీవితంలో చూసుకుంటుంది అన్నారు.