సర్పంచులకు సీఎం కేసీఆర్ శిక్షణ

Telangana cabinet expansion date fixed
Telangana cabinet expansion date fixed

సోమవారం నాలుగున హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని షెఫర్డ్స్ ప్రేయర్ గ్రౌండ్ లో సర్పంచ్ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం 2018పై ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. 300 మంది సర్పంచ్ లు, అధికారులు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.

కొత్త పంచాయతీ రాజ్ చట్టంపై సర్పంచ్, అధికారులకు సీఎం కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. ఏకధాటిగా 4 గంటలపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన వారు.. జిల్లా, మండల స్థాయిలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు.