మహా చండీయాగం చేస్తోన్నసిఎం కేసీఆర్ దంప‌తులు

kcr

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు.విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో యాగాలు జ‌రుగుతున్నాయి.తొలి రోజు వంద సప్తశతి చండీ పారాయణాలు, సహస్ర చండీ యాగం, రాజ శ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్ర మహాయాగం చేస్తున్నారు.

యాగంలో అసెంబ్లి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌అలీ, కేటీఆర్‌ దంపతులు, ఎంపీలు కవిత, లక్ష్మీకాంతారావులు పాల్గొన్నారు.మహాయాగ క్రతువులు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి.శృంగేరీపీఠం సాంప్రదాయాల ప్రకారం యాగాలను నిర్వహిస్తున్నారు. యాగాల్లో 300 మంది రుత్వికులు పాల్గొన్నారు.