క‌రీంన‌గ‌ర్ నుంచి ప్ర‌చార శంఖారావాన్ని పూరించిన సిఎం కేసీఆర్

KCR
KCR

తెలంగాణ అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా మారిందన్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఆయ‌న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార శంఖారావాన్ని పూరించారు. ఐదేళ్ల కింద తెలంగాణకు.. ఇప్పటి తెలంగాణకు తేడా ఉందన్నారు ఆయ‌న‌. ఆనాడు విద్యుత్ సరిగా లేక ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయినయన్నారు. కరెంట్ రంగంలో అద్భుతం సృష్టించినమన్నారు.

రైతాంగానికి 24గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా అంటే అది తెలంగాణనే అన్నారు.. ఆనాడు ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాలు పట్టేందన్నారు. ఇప్పుడు ఆరు నెలల్లోనే ఎల్ఎండీ పూర్తి చేసినమన్నారు . ఆరు నెలల్లో కాళేశ్వరం పూర్తి చేస్తమని ధీమా వ్య‌క్తం చేశారు సిఎం కేసీఆర్‌. ఏపీలో చంద్రబాబును ఓడిస్తానని భయపడుతున్నాడన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కర్త, కర్మ అని చెప్పే చంద్రబాబు త‌న‌ను 3వేల సార్లు తిట్టాడన్నారు.

20ఏళ్ల క్రితం తెలంగాణ తెస్తానని చెప్తే చాలా అవహేళన చేశారన్నారు. పరిపాలన చేయరాదని ఎవరైతే అన్నరో… వాళ్లకు వెయ్యి రెట్లు మెరుగ్గా పనిచేస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్.. ఇద్దరూ దొంగలేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. వీళ్లా మన ప్రధాని అభ్యర్థులు అని ప్రశ్నించారు. వీళ్లు ఏం చేశారని మనం వీళ్లను ప్రధానులను చేయాలని అడిగారు. దేశానికే మార్గదర్శకంగా మనం తయారయ్యామన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా రైతాంగానికి 24గంటల కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. కేంద్రం మనకు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. రాజ్యాంగబద్దంగా రావాల్సినవి వచ్చాయన్నారు. యావత్ భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్టేట్‌గా నిలిచిందన్నారు.

దేశంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ దద్దమ్మలుంటే దేశం సస్యశ్యామలం కాదన్నారు. దేశంలో మార్పు రావాలంటే ఫెడరల్ ఫ్రంట్ రాాలన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా ఉండాలన్నారు. విజన్ లేని జాతీయ పార్టీల నేతలతో దేశం అభివృద్ది చెందదన్నారు.