లోక కల్యాణం కోసం సిఎం కేసీఆర్ చండీయాగం

Kalvakuntla Chandrashekar Rao
Kalvakuntla Chandrashekar Rao

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఒక యాగం నిర్వ‌హించిన సిఎం కేసీఆర్ … ఇప్పుడు విజ‌యం త‌ర్వాత మ‌రో యాగానికి సిద్ద‌మ‌య్యారు. ఈనెల 21నుండి చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించాలని ఆయ‌న డిసైడ్ అయ్యారు.

21నుండి 25వ తేదీవరకు ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌజ్‌లో రాష్ట్రాభివృద్ధి, లోక కల్యాణం కోసం ఈ యాగం చేయ‌నున్నారు. శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో ఈ మహా యాగం జరగనుంది. చతుర్వేద పండితులు మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, పురాణం మహేశ్వర శర్మ తదితరుల ఆధ్వర్యంలో 200 మంది రుత్విక్కులతో శృంగేరి పద్ధతిలో ఈ యాగం జరగనుంది.

25వ తేదీన పూర్ణాహుతితో యాగం సమాప్తం కానుంది. యాగం సందర్భంగా తొలి రోజుల 100 సప్తశతి చండీపారాయణలు, రెండోరోజు 200, మూడోరోజు మూడు వందలు, నాలుగోరోజు నాలుగువందల పారాయణలు ఉంటాయి. అంతా కలిపితే వేయి పురాణాలు ఉంటాయని, ఐదవరోజు 11 యజ్ఞకుండాల వద్ద వంద పారాయణల స్వాహాకారాలతో హోమం నిర్వహించను న్నారు. నాలుగురోజులలో వేయికి పైగా రుద్రపారాయణాలు జ‌ర‌ప‌నున్నారు.