ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్య‌త – తెలంగాణ సిఎం కేసీఆర్

KCR
KCR

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కొత్త ఏడాది తొలి రోజునే నీటి పారుదల ప్రాజెక్టుల బాట పట్టనున్నారు.ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు శ్రీ రాంసాగర్‌ పునరుజ్జీవ పథకం,పాలమూరు-రంగారెడ్డి,డిండి, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది.దీనిలో భాగంగానే ముఖ్య‌మంత్రి స్వయంగా నిర్మాణాలను పరిశీలించాలని భావిస్తున్నారు.రెండు దశల్లో సాగనున్న ఈ పర్యటనలో మొదట జనవరి ఒకటి,రెండు తేదీల్లో షెడ్యూలు ఖరారైంది.

తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై నిశితంగా దృష్టి సారించనున్నారు.రెండో దశలో కొండపోచమ్మసాగర్‌, పాలమూరు-డిండి, సీతారామ ప్రాజెక్టులు సందర్శించ‌నున్నారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఖరారు కావాల్సి ఉంది.రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలుత ఆయన ప్రాజెక్టులపైనే సమీక్ష నిర్వహించారు.తద్వారా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ తొలి ప్రాధాన్యం ప్రాజెక్టులే అని ఆయ‌న సంకతాలిచ్చారు.