17 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

Telangana Legislative Assembly
Telangana Legislative Assembly

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో ఈ నెల 17న అసెంబ్లీ కొలువుదీరనుంది. నాలుగురోజులపాటు తొలి సమావేశాలు కొనసాగుతాయి. సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఈ నెల 16న ప్రొటెం స్పీకర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 17న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది . అదే రోజు శాస‌న సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమవుతుంది. 19న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20 న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది.