స్టీఫెన్‌ సన్ కు సిఎం కేసీఆర్ మ‌రో అవ‌కాశం

stephenson

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లిలో నామినేటెడ్‌ సభ్యుడి నియామకానికి తీర్మానం చేశారు.ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిగా స్టీఫెన్‌ సన్ ను నియమించాలని కేబినెట్‌ నిర్ణయించింది. స్టీఫెన్‌ సన్‌ను నియమిస్తూ మంత్రివర్గం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం అభినందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌, ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించింది.