కేసీఆర్, జగన్ లు కలిసినా ఏపిని ఏమి చేయ‌లేరు – సిఎం చంద్ర‌బాబు

Chandra-Babu
Chandra-Babu

నాకేదో గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నాడని, కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే… తెలుగు ప్రజలు ఆయనకు మూడు గిఫ్ట్ లు ఇస్తారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం, స్పీకర్ పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారకరామా సాగరంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల ఎన్టీఆర్ సాగర్‌లో బోటులో విహరించారు.

అనంతరం చెరువు పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్‌లను చంద్రబాబు ప్రారంభించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కేసీఆర్ కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడన్నారు. కేసీఆర్, జగన్ లు కలిసినా ఆంధ్రప్రదేశ్ ను ఏమీ చేయలేరన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈడీ దాడులా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే వరకు కేంద్రాన్ని వదిలేది లేదన్నారు.