ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరంత‌రం కృషి – ఎంపి క‌విత‌

K Kavitha TRS
K Kavitha TRS

నిజామాబాద్ జిల్లాలోని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించినట్లు నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత వెల్ల‌డించారు. టీఆర్‌ఎస్‌ నేతలను గెలిపిస్తే ఢిల్లీలో మన సమస్యల మీద పోరాడుతామన్నారు ఆమె. ఉన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రెంజిల్‌ మండలంలో రోడ్ షో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రెంజల్‌ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంత‌రం ఎంపి క‌విత మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.

రెంజల్‌ మండలంలో వెయ్యి కుటుంబాలకు కల్యాణలక్ష్మి ద్వారా లబ్ది జరిగిందని తెలిపారు . నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు రూ. 67 కోట్లతో కెనాల్‌లకు మరమ్మతులు చేయిస్తున్నట్లు ఆమె వివ‌రించారు.