ఆన్ లైన్ లో కథానాయకుడు

NTR Kathanayakudu
NTR Kathanayakudu

ఈ రోజుల్లో సినిమా రిలీజ్ కి ముందు బ్యాక్ ఎక్కువయినా కూడా చాలా డేంజర్ అని నిరూపించింది సంక్రాంతికి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు.ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆ సినిమా పై బజ్ క్రియేట్ చెయ్యడానికి చాలా ఎక్కువగా చెప్పారు.అయితే సినిమాలో మాత్రం ఆ రేంజ్ కంటెంట్ కనిపించలేదు.కానీ ఒక మోస్తరు కంటెంట్ ఉంది…రివ్యూస్ పోసిటివ్ గా వచ్చాయి.పైగా పండగ సీజన్.కానీ ఇవేవి మహానాయకుడు పరాజయాన్ని అడ్డుకోలేకపోయాయి.టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయిన అజ్ఞాతవాసి,స్పైడర్ సరసన ఈ సినిమా నిలిచే పరిస్థితి వచ్చింది.సాలిడ్ గా 50 కోట్ల నష్టం లెక్క తేలింది.

ఎన్టీఆర్ కథానాయకుడు పరాజయం తో ఆ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుకి కొనుకున్న OTT ప్లేట్ ఫామ్ ఈ సినిమాని ఆన్ లైన్ లో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయిపోయింది.ఫిబ్రవరి 7 న కథానాయకుడు సినిమాని స్ట్రీమ్ చేస్తున్నారు.అంటే నెలరోజులు కూడా తిరగకుండానే ఆన్ లైన్లోకి వచ్చేస్తున్నాడు కథానాయకుడు.భారీ బడ్జెట్ సినిమాల్లో ఇంత తక్కవ టైం లో డిజిటల్ లో రిలీజ్ అవుతున్న సినిమాగా నిలిచింది.అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉండడం,దాంట్లో కంటెంట్ ఉంది అని జరుగుతున్న ప్రచారం వల్ల ఈ నిర్ణయం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకి ప్లస్ గా మారే అవకాశం ఉంది.