కథనం టీజర్ రివ్యూ : అనసూయ ఆన్ యాక్షన్ మోడ్

Kathanam Movie TEASER Review in Telugu
Kathanam Movie TEASER Review in Telugu

క్షణం సినిమాతో మంచి హిట్ అందుకోవడమే కాదు నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకుంది అనసూయ.ఆ తరువాత కొన్ని సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నా కూడా మరోపక్క పొటెన్షియల్ ఉన్న లేడి ఒరింటెడ్ స్క్రిప్ట్స్ కూడా ఎంచుకుంటుంది.ప్తస్తుతం కథనం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఉమెన్స్ డే సందరభంగా ఆ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.సినిమా డైరెక్టర్ గా మారాలి అనుకునే అనసూయ కారెక్టర్ డిఫరెంట్ గా ఉంది.

ఇక ఆ పాత్రలో ఆమె స్టైలింగ్ బావుంది.ఒక మర్డర్ మిస్టరీ కి డైరెక్టర్ ఇచ్చిన కొత్త ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.చూడగానే ఫిలిం బై అరవింద్ లా అనిపించినా ఎదో థ్రిల్లర్ ఎలిమెంట్ తో సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నారు అని అర్ధమవుతుంది.ఇక ఈ సినిమాలో అనసూయ కొద్దిపాటి యాక్షన్ డోస్ కూడా రుచి చూపించింది.

అవసరాల శ్రీనివాస్,ధన్ రాజ్,రణధీర్,పృథ్వి,వెన్నెల కిషోర్ లాంటి ఆర్టిస్టుల ప్యాడింగ్ వల్ల కథనం సినిమాకి పెద్ద సినిమా లుక్ వచ్చింది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన క్షణం లానే కథనం కూడా అనసూయకి హిట్ అందిస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Kathanam Movie TEASER