దేవ్ మూవీ రివ్యూ

Karthi Dev Movie Review
Karthi Dev Movie Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2019
రేటింగ్ : 1.5/5
నటీనటులు : కార్తి, రకుల్ ప్రీత్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ
దర్శకత్వం : రజత్ రవి శంకర్
నిర్మాతలు : లక్ష్మణ్ కుమార్
సంగీతం : హారిస్ జైరాజ్
సినిమాటోగ్రఫర్ : వెల్ రాజ్
ఎడిటర్ : అంథోని ఎల్ రూబెన్

హీరో కార్తి..పేరుకు తమిళ్ హీరో అయినా.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం అతను ఎంచుకుంటున్న కథాబలం ఉన్న సినిమాలు. కార్తి ఏదైనా సినిమా చేశాడు అంటే..దాన్లో ఏదైనా ఒక మంచి ఎలిమెంట్ ఉంటుంది అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. దీనికి తోడు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించడం, టాప్ రేటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చెయ్యడం, ట్రైలర్స్, ఎగ్జైటెడ్ గా ఉండడంతో కార్తి నటించిన దేవ్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసిందా లేక ఎగ్జిట్ ఎక్కడ అని వెదుక్కునేలా చేసిందా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

దేవ్ కి చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్స్ చెయ్యడం అంటే ఇష్టం.అలాంటి దేవ్ ఫస్ట్ టైమ్ ..మేఘనను చూసి ఎడ్వెంచర్స్ నుంచి లవ్ వైపు టర్న్ అవుతాడు.కానీ మేఘన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల తనకు మగాళ్ళందరిపై ద్వేషం కలుగుతుంది.దాంతో దేవ్ ని నమ్మదు.దూరంగా ఉంచుతుంది.కానీ అతని సిన్సియారిటీ, అటెన్షన్ చూసి ఇష్టపడుతుంది.అయితే మేఘన కి సర్ ప్రైజ్ ఇద్దామనుకుని దేవ్ చేసిన ఒక పని వల్ల మనస్పర్దలు వచ్చి ఇద్దరూ విడిపోతారు. తిరిగి వాళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు అనేది సినిమా కథ.

నటీనటలు:

ఇప్పటి వరకూ తాను నటించిన ప్రతి సినిమాలో పక్కింటి అబ్బాయిలా న్యాచురల్ లుక్స్ తో టైమింగ్ ఉన్న యాక్టింగ్ తో అలరించిన కార్తి..దేవ్ సినిమా విషయానికొచ్చేసరికి అడుగడుగునా కథలో ఉన్న కన్ ఫ్యూజన్ తో డైరెక్టర్ చెప్పిందల్లా చేసుకుని వెళ్లిపోయాడు. కార్తి స్టైలింగ్ బాగానే ఉన్నా.. డ్యాన్సు, ఫైట్లు కష్టపడి చేసినా..నటనపరంగా అంత యాక్టివ్ గా కనిపించలేదు.చాలా కాలం తర్వాత దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రకుల్ ప్రీత్ ని చూస్తే..ఆశ్చర్యమేస్తుంది.ఫేస్ లో ఏమాత్రం గ్లో లేదు.ఎక్స్ ప్రెషన్స్ కూడా ..ఏదో ఫస్ట్ సినిమాలా అరకొరగా ఉన్నాయి.కొన్ని కొన్ని చోట్ల అసలు ఈమె రకులే నా… అనిపిస్తుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి ప్రతిభావంతులయిన నటులు పేరుకే తప్ప దేనికీ ఉపయోగపడలేదు.హీరో ఫ్రెండ్స్ గా నటించిన క్యారెక్టర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

టెక్నీషియన్స్:

ఈ సినిమా డైరెక్టర్ రజత్ రవిశంకర్ అసలు..ఏ పాయింట్ మీద కథ మొదలుపెట్టాడు..ఎటునుంచి ఎటు వెళ్లాడు.. సినిమాని ఎలా ముగించాడు అని ఆలోచిస్తే..బుర్ర హీట్ ఎక్కడం ఖాయం.అర్ధం పర్ధం లేని కథ,అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే , దారుణమైన డైరెక్షన్ తో దేవ్ సినిమా చూడడమే పెద్ద సాహసం అనిపించేలా మలిచాడు.సినిమా పూర్తిగా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి అనిపించేలా అవుట్ పుట్ ఇచ్చాడు డైరెక్టర్.0ఎలాంటి పాత్రనైనా హ్యాండిల్ చెయ్యగల సత్తా ఉన్న నటీనటులను పక్కనపెట్టుకుని సినిమాలో ఒక్కసీన్ కూడా బాగుంది అనేలా మలచలేకపోయాడు.రైటింగ్ స్టేజ్ నుంచే ఈ సినిమా పూర్తిగా అవుట్ ఆఫ్ ట్రాక్ లోకి వెళ్లిపోయిందనేది ఈ సినిమా చూస్తే అర్దమవుతుంది. హరీష్ జయరాజ్ కూడా అవుట్ పుట్ కి తగ్గట్టు సో..సో..గా అనిపించే మ్యూజిక్ తో సరిపెట్టేశాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్న వేల్ రాజ్ మాత్రం.. సినిమా రిచ్ లుక్ రావడానికి చాలా కష్టపడ్డాడు. నిర్మాతలు కార్తిని నమ్మి..ఖర్చును వెనకాడకుండా..రిచ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూసే సినిమాకి హైలెట్.

ఫైనల్ గా:

మంచి బజ్ తో మంచి గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవ్..కంటెంట్ పరంగా కాస్తైనా మెప్పించి ఉంటే..తేలిగ్గా గట్టెక్కేది. కానీ..ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా..అడుగడుగునా స్పీడ్ బ్రేకర్స్ తో కుదుపులతో సినిమా చూడడమే ఓ అడ్వెంచర్ అనిపించేలా..ఉన్న దేవ్ ఏవర్గం ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు.

బోటమ్ లైన్:దేవ్…డా!