ఈ స‌మావేశాల్లోనే కాపుల రిజ‌ర్వేష‌న్ల బిల్లు

AP cabinet meeting
AP cabinet meeting

ఏపి కేబినెట్ స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సిఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా సాగిన ఈ స‌మావేశంలో మంత్రి వ‌ర్గం వివిధ అంశాల‌ను చ‌ర్చించింది. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశాలలోనే కాపులకు రిజర్వేషన్ బిల్లును పెట్టనున్నారు. డ్వాక్రా నగదు నిధుల పంపిణీకి ఆమోదం, చుక్కల భూముల సమస్య పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఇక ప్రత్యేకహోదా, వంశధార నిర్వాసితులపై కేసుల ఎత్తివేత, సమైక్యాంధ్ర నాటి కేసులు ఎత్తివేతకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది. భూధార్ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నాయీబ్రాహ్మణ, చేనేత వృత్తుల కార్మికులకు ఉచిత విద్యుత్ హామీని ఆమోదించారు. ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆమోదించి రానున్న మూడేళ్ళలో 260 కోట్లను ఖర్చుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ పెడరేషన్లను కార్పొరేషన్లుగా చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు.