ప్రధాన మంత్రి పాత్రలో కన్నడ సూపర్ స్టార్…!

Mohan Lal

కెవి ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కాప్పాన్’.ఈచిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారని సమాచారం.ఆయనకు సెక్యూరిటీ కమాండర్ గా సూర్య కనిపించనున్నాడట. ఈ చిత్రంలో సూర్య సరసన సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవల ఈచిత్రం రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.ఈ సినిమాలో బోమన్ ఇరానీ,ఆర్య,చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.