జూన్ 14న ఉపేంద్ర “ఐ లవ్ యు” విడుదల

Upendra
Upendra

ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత తెలుగులో కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం “ఐ లవ్ యు” . కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.తెలుగులో అత్యధిక థియేటర్లలో ఈ నెల 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖపట్టణం సముద్రతీరంలో ఐ లవ్ యు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన స్టార్ హీరోయిన్ డింపుల్ క్వీన్ రచిత రామ్ హీరోయిన్ గా నటిచింది. ఆర్‌. చంద్రు దర్శకుడు.శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కించారు.