చంద్ర‌బాబుది మ‌రో మ‌హా నాట‌కం – క‌న్నా విసుర్లు

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మహానాటకానికి తెరతీశారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆయన దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో యూటర్న్ తీసుకునే అవసరం లేకుండా ప్రజలు చంద్రబాబును నారావారి పల్లెకు పంపిస్తారని సెటైర్ వేశారు.

గుంటూరులో ప్రధాని సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందన్న కన్నా.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజలు తరలివచ్చారని చెప్పారు. కేంద్రం ఏం చేసిందో చెబుతున్నా, ఏమీ చేయలేదని బాబు చెబుతుంటే అదే హైలైట్‌ అవుతోందన్నారు క‌న్నా.. ప్రధాని మోడీ సింహం లాంటి వార‌ని కితామిచ్చారు ఆయ‌న .