మణికర్ణిక రేర్ ఫీట్

Manikarnika
Manikarnika

కంగనా రనౌత్ ముఖ్యపాత్రలో నటిస్తున్న సినిమా మణికర్ణిక.బ్రిటిష్ వాళ్ళను ఎదురించి పోరాడిన వీరనారిగా ఘన చరిత్ర ఉన్న ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవితచరిత్ర ఆధారంగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కి స్క్రిప్ట్ అందించారు.డైరెక్టర్ క్రిష్ చాలా వరకు ఈ సినిమాని కంప్లీట్ చేసారు.కానీ తరువాత జరిగిన కొన్ని అన్ నోన్ ఇన్సిడెంట్స్ తో కంగనా డైరెక్టర్ గా మారి ఈ సినిమాని పూర్తి చేసింది.రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులముందుకు వస్తుంది మణికర్ణిక.ఈ సినిమాపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.అందుకే ఈ సినిమా రిలీజ్ ని భారీ ఎత్తున ప్లాన్ చేసారు.

ఫస్ట్ వీక్ ఎండ్ లో సినిమాకి పెట్టిన 125 కోట్ల బడ్జెట్ రికవర్ చెయ్యాలనేది టార్గెట్.అందుకే హిందీ,తెలుగు,తమిళ్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.అంతే కాదు ఈ ప్రెస్టీజియస్ బయోపిక్ ని ఏకంగా 50 దేశాల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లానింగ్ చేసారు.క్వీన్ సినిమాతో కంగనా రనౌత్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు దక్కింది.ఆ ఫాలోయింగ్ ని ఇప్పుడు ఇలా వాడుకుంటున్నారు.వార్ సీక్వెన్సెస్,గ్రాండియర్,ఎమోషన్స్ కూడా అబ్రాడ్ ఆడియన్స్ ని అలరిస్తాయి అని టీమ్ నమ్మకంగా ఉంది.కాకపోతే ఈ సినిమాకి థాక్రే రూపంలో బాలీవుడ్ లో,మిస్టర్ మజ్ను రూపంలో తెలుగులో  గట్టి పోటీ మాత్రం ఉంది.ఈ రెండిటిని తట్టుకుని మాణికర్ణిక్ ఏ రేంజ్ విజయం అందుకుంటుందో వేచి చూడాలి.