100 కోట్ల బయోపిక్…కంగనాకు 24 కోట్లు

Kangana Ranaut, Bollywood, Director,
Kangana Ranaut

దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా రకరకాల ఫేమస్ పర్సనాలిటీస్ గురించి బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి.రచయితలకు కొత్తరకం కథలకు కొరత రావడం,గొప్పవాళ్ళ జీవితాల్లో ఉండే ఆసక్తికరమయిన మలుపులు కూడా ప్రేక్షకులను ఫుల్ ప్లెడ్జెడ్ గా ఎంటర్టైన్ చేస్తుండడంతో బయోపిక్స్ హవా నడుస్తుంది.ఇన్నాళ్లు అనేకమంది అనౌన్స్ చేస్తూ వచ్చిన జయలలిత బయోపిక్ ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా రెడీ అవుతుంది.ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

బాలీవుడ్ లో తన హవా చాటుతున్న కంగనా రనౌత్ జయలలితగా నటించబోతుంది.ఈ సినిమాకోసం ఆమెకి ఏకంగా 24 కోట్ల పారితోషికం అందించడానికి ఓకే అన్నారు ఈ సినిమా నిర్మాత విష్ణు ఇందూరి.AL విజయ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.తమిళ్ లో తలైవి,హిందీ లో జయ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారు.తెలుగులో అమ్మ అనే పేరు పరిశీలనలో ఉంది.

ప్రస్తుతానికి మూడు భాషలు అనుకుంటున్నా కంగనా ప్రెజెన్స్ వల్ల రిలీజ్ టైం కి మరికొన్ని భాషల్లో కూడా ఈ సినిమా డబ్ అయ్యే అవకాశం ఉంది.ఇక విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎన్టీఆర్ తో పోగొట్టుకున్న డబ్బును కూడా ఇక్కడ రాబట్టుకోవాలి అనేది విష్ణు ప్లానింగ్ గా తెలుస్తుంది.నిజ జీవితంలో అనేక సంచలనాలకు నెలవుగా మారిన జయలలిత జీవితం వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అనేది మరికొన్ని నెలల్లో తేలనుంది.