కాంచన 3 రివ్యూ

Kanchana3 Movie Review in Telugu
Kanchana3 Movie Review in Telugu

నటీనటులు : రాఘవ లారెన్స్, కోవై సరళ, వేదిక, ఓవియా తదితరులు.
దర్శకత్వం : రాఘవేంద్ర లారెన్స్
నిర్మాత : కళానిధి మారన్
సంగీతం : యస్ థమన్
సినిమాటోగ్రఫర్ : వెట్రి
ఎడిటర్ : రుబెన్
విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2019
రేటింగ్ : 2/5

ముని సినిమాతో హార్రర్ కామెడీ జానర్ తో భారీ హిట్ కొట్టాన రాఘవ లారెన్స్ ఇదేసిరీస్ ని కంటిన్యూ చేస్తూ.. కాంచన, గంగ సినిమాలతో కూడా తిరుగులేని విజయాలు దక్కించుకున్నాడు. నటుడిగా, డైరెక్టర్ గా తనకు విజయాలు అందిస్తున్న ఇదే సిరీస్ ను కొనసాగిస్తూ.. ప్రొడ్యూసర్ గా కూడా మారి కాంచన 3 ని తెరకెక్కించాడు. గత సినిమాల మాదిరిగా కాంచన 3 కూడా భయపెడుతూ , నవ్విస్తూ, హిట్ అందుకుందా .. లేక లారెన్స్ కి షాకిచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ : తన అమ్మమ్మ , తాతయ్య ల షష్టిపూర్తి కోసం కుటుంబ సమేతంగా వరంగల్ లోని తాతయ్య వాళ్లింటికొస్తాడు రాఘవ. అయితే అలావస్తున్న క్రమంలో అనుకోకుండా 2 దెయ్యాలను వెంటపెట్టుకుని వస్తాడు. దాంతో ఆ ఇంట్లో రకరకాల భయంకర సంఘటనలు జరుగుతుంటాయి. భయపడిన వాళ్లింట్లో వాళ్లంతా కలిసి మునీశ్వర స్వామి గుళ్లోని అఘోరా దగ్గరకెళతారు. ఆ ఇంట్లో ఉన్న, రాఘవ ఒంట్లో ఉన్న కాళి, రోజీ అనే రెండు ప్రేతాత్మల గురించి చెప్తాడు. అసలు ఆ కాళి, రోజీలు ఎవరు..? ఎ:దుకు వారు ప్రేతాత్మలుగా మారారు ..? రాఘవని ఆవహించి ఎలా వాళ్లు పగతీర్చుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే

నటీనటులు :

లారెన్స్ కు నటుడిగా బాగా గుర్తింపు తీసుకొచ్చింది కాంచన సిరీస్. భయపెడుతూ, నవ్విస్తూ..మెల్లమెల్లగా తనలోని నటుడిని అందరికీ అలవాటు చేసిన లారెన్స్ ఈ సినిమాలో కూడా సేమ్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. అయితే మాస్ టచప్ కోసం ఈ సారి ఏకంగా 3 హీరోయిన్లను పెట్టాడు. అయితే వాళ్లకు పేరుకు చెప్పుకునే పాత్రలు తప్ప…. పేరు తెచ్చే పాత్రలు దక్కలేదు. లారెన్స్ కూడా గత సినిమాల్లానే నార్మల్ గా చేస్తూ వెల్లిపోయాడు. ఇక కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇంతకు ముందు కాంచన సిరీస్ సినిమాల్లో లాగానే కనిపించారే తప్ప.. కొత్తదనం చూపించలేదు. మిగతా వాళ్లందరూ పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ కొంతమంది నటన మాత్రం ఓవర్ యాక్షన్ అనిపించింది

టెక్నీషియన్స్: ఈ సినిమాకి రచయిత, నిర్మాత, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ఈ సిరీస్ లో వచ్చిన 3 సినిమాల కన్నా ఈ సినిమా భారీ విజయం సాధించాలని కథలో అనేక ఎలిమెంట్స్ ను పెట్టి.. దేనికీ న్యాయం చెయ్యలేకపోయాడు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా.. అస్తవ్యస్తంగా, గందరగోళంగా తయారైంది. ఇక పాటలైతే.. స్పీడ్ బ్రేకర్లా.. సినిమా ఫ్లో కి దారుణంగా అడ్డం పడ్డాయి.ఈ విధంగా రాఘవ లారెన్స్ డైరెక్టర్ గా పూర్తిగా తడపడ్డాడు. థమన్ పాటలు రొటీన్ గా ఉన్నా ఆర్.ఆర్ మాత్రం పరవాలేదనిపించి.. హారర్ సన్నివేశాలు ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడింది. సర్వేష్ మురారి , వెట్రిపళని స్వామి ల సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి.

ఫైనల్ గా: సెన్సేషనల్ హిట్ సిరీస్ అయిన కాంచన బ్రాండ్ నేమ్ తో తెరకెక్కించన కాంచన 3 కథ, కథనాల విషయంలో పూర్తిగి నిరాశ పరచింది. ఊరమాస్ కామెడీ మరికొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే బి,సి సెంటర్స్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

బోటమ్ లైన్ : కాంచన…తట్టుకోలేం