కళ్యాణ్ రామ్ మూవీ విడుదల తేదీ ఖరారు…!

Kalyan Ram
Kalyan Ram

‘పటాస్’ తరువాత నందమూరి కల్యాణ్ రామ్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు.అయితే తాజాగా కళ్యాణ్ రామ్ కె వి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు ‘118’ పేరును ఖరారు చేసారు.

కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత మహేష్ కోనేరు ఇటివలే తెలిపారు.