అర్ధ గంట ఉద్యమం చేసే పార్టీ మాది కాదు – ఎంపి క‌విత

K Kavitha TRS
K Kavitha TRS

కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేసినట్టు కెమెరాలు ఉన్నప్పుడు అర్ధ గంట ఉద్యమం చేసే పార్టీ మాది కాద‌న్నారు
నిజామాబాద్‌ ఎంపి కవిత . ఫోటోలు, కెమెరాలు ఉన్నా లేకున్నా, తనతో పాటు సహచర టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఐదు రోజుల పాటు లోక్‌సభలో ప్ల కార్డులు ప్రదర్శించి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడి హైకోర్టును సాధించామ‌న్నారు ఆమె. జ‌గిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం పెంబర్ల-కొనాపూర్‌ నుండి ఎంపి క‌విత ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున16 మంది ఎంపీలు గెలిస్తే, సీఎం కెసిఆర్‌ ఢిల్లీలో చక్రం తిప్పుతార‌న్నారు. ఇక్కడ 16 గెలిస్తే.. కేసీఆర్ తన రాజకీయ నైపుణ్యంతో ఢిల్లీలో 116 చేసుకుంటార‌న్నారు ఆమె. రేపటి రోజు కేంద్రంలో ఏ సర్కార్ ఉన్నా, మన పనులను వేగంగా జరిగేలా చేసుకుంటారు సీఎం కెసిఆర్‌ అని వెల్ల‌డించారు ఎంపీ కవిత.