న‌మ్మ‌కంతోనే ప్ర‌జ‌లు మ‌ళ్లీ అధికారం ఇచ్చారు – సిఎం కేసీఆర్

KCR
KCR

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్నారు తెలంగాణ సిఎం కేసీఆర్‌. సాగునీటి ప్రోజెక్టులపై సీఎం కెసిఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కృష్ణా, గోదావరి బేసిన్ లలో రాష్ట్ర వాటాను ఉపయోగించుకోవడానికి తగిన వ్యూహం అమలు చేయాలని ఆదేశించారు ముఖ్య‌మంత్రి.

ఈ ఏడాదిలోనే నూటికి నూరు శాతం ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరారు. మనపై నమ్మకంతోనే మనకు రెండో సారి అధికారం ఇచ్చారని, పాలమూరు-రంగారెడ్డి శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. పాలమూరులో వలసపోయిన వారు వెనక్కు వచ్చారని, అందుకే మనం మహబూబ్ నగర్ లో 13 సీట్లు గెలిచామని వివ‌రించారు సిఎం కేసీఆర్‌.

టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీళ్లు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చార‌ని ఆయ‌న చెప్పారు.