‘కల్కీ’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల…!

‘అ’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డా.రాజశేఖర్‌ నటిస్తున్న చిత్రం ‘కల్కి’.ఈ చిత్రంలో ఆదాశర్మ, స్కార్లెట్‌ విల్సన్‌ హీరోఇన్లు గా నటిస్తున్నారు.1983 నేపథ్యంలో ఈ సినిమా తెరక్కేకనుంది. నూతన సంవత్సరం సందర్భంగా కల్కి ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

అశుతోష్‌ రానా, నాజర్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు.శివానీ శివాత్మిక మూవీస్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్‌, శివానీ, శివాత్మిక నిర్మాతలు.