కళంక్ టీజర్ రివ్యూ : గ్రాండియర్ అండ్ స్టార్ కాస్ట్

Kalank
Kalank

వరుణ్ ధావన్,సంజయ్ దత్,మాధురి దీక్షిత్,అలియా భట్,ఆదిత్య రాయ్ కపూర్,సోనాక్షి సిన్హా,కియారా అద్వానీ..ఇలా స్టెల్లార్ స్టార్ కాస్ట్ తో,భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా కళంక్.ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.టోటల్ గా పీరియాడిక్ సెటప్ తో ఒక మూడ్ ఒరింటెడ్ సినిమాగా తెరకెక్కించారు అని అర్ధమవుతుంది.

కరణ్ జోహార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడంతో సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి.టీజర్ వరకు కేవలం సినిమాలో నటంచిన భారీ తరగణాన్ని చూపిస్తూ,సినిమాలో కళ్ళు చెదిరే విజువల్స్ ఉన్నాయి అనే విషయాన్ని మాత్రమే కన్వే చేసారు.కొన్ని బంధుత్వాలు రుణాలుగా మిగిలిపోతాయి అనే ఒక్క సినిమా థీమ్ పాయింట్ తప్ప టీజర్ లో సినిమా కంటెంట్ గురించి పెద్దగా హింట్స్ ఏమీ ఇవ్వలేదు.

అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు.మాధురి దీక్షిత్,సంజిత్ దత్ ల రీ ఎంట్రీ ఈ సినిమాకి బాగా కలిసొచ్చేలా ఉంది.అయితే ఈ మధ్య బాలీవుడ్ లో గ్రాండియర్ ని నమ్ముకుని వచ్చిన అనేక బడా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఏప్రిల్ 17 న తెలుస్తుంది.

కళంక్ టీజర్