కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారి జన్మదినం నేడు

Kasinathuni Viswanath
Kasinathuni Viswanath

కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులని గెలుచుకున్న క‌ళాత‌పస్వి కె.విశ్వనాథ్ జీవితం ఆధారంగా విశ్వదర్శనం అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జనార్ధన మహర్షి దర్శకుడు. నేడు కె.విశ్వనాథ్ జన్మదినం. ఈ సందర్భంగా చిత్ర టీజ‌ర్ విడుదల చేశారు. ఇందులో ఆ మ‌హానుభావుడు గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు మాట్లాడారు. విశ్వనాథ్ తెర‌కెక్కించిన‌ ఆణిముత్యాల్లాంటి సినిమాలు చేసిన న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న‌చందాన ఉన్నాయని అన్నారు. విశ్వదర్శనం అందరూ ప్రశంసించే మంచి చిత్రమవుతుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూఛిబొట్ల తెలిపారు