కాజల్ కు ‘జెట్ ఎయిర్ వేస్’ లో గంట సేపు తలుపులు మూసేసి…!

Kajal Agarwal at Jet Airways
Kajal Agarwal at Jet Airways

టాలీవుడ్ స్టార్ హీరొయిన్ కాజల్ అగర్వాల్ కు ‘జెట్ ఎయిర్ వేస్’ లో చేదు అనుభవం ఎదురైంది, దీంతో ట్విట్టర్ వేదికగా జెట్ ఎయిర్ వేస్ పై మండి పడ్డారు. ప్రయాణికుల పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు చాలా దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేసారు, తాము 75నిమిషాల ముందే ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నప్పటికీ, అక్కడున్న మొయిన్ అనే కౌంటర్ స్టాఫ్ కు సంబందించిన వ్యక్తి తమ సమయాన్ని వృధా చేసారని అన్నారు. అంతే కాకుండా ఇంటెర్నేషనల్ టర్మినల్ నుండి విమానాన్ని తీసుకొచ్చి డొమెస్టిక్ తీర్మనాల్ వద్ద పార్క్ చేసి 30నిమిషాలకు పైగా ససమయాన్ని వృధా చేసారని మండి పడింది కాజల్ అగర్వాల్.

అంతే కాకుండా గంటసేపటి పాటు తలుపులు మూసి ఉంచి చాలా ఇబ్బందిపెట్టారని, అక్కడి సిబ్బంది తీరు తామను అసహనానికి గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజల్ ట్వీట్లతో అప్రమత్తమైన జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం, అక్కడ జరిగిన పొరపాట్ల గురించి తనతో చర్చిస్తామంటూ కాజల్ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే కాజల్ అభిమానులు జెట్ ఎయిర్ వేస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరి జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.